NLR: నగరంలో త్వరలో జరగనున్న 13వ అంతర్ జిల్లాల బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ వాల్ పోస్టర్ను రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మే 7 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించే పోటీలు విజయవంతం చేయాలన్నారు. పలు గ్రామాల నుంచి క్రీడాకారులు కబడ్డీ పోటీల్లో తలపడనున్నారు.