విశాఖలో సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. ఇంటింటి సర్వేలో బతికున్న వారిని మృతులుగా నమోదు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ ఎస్ఎస్ వర్మ చర్యలు తీసుకుని ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. కొత్త రోడ్డు, రెల్లివీధి, దస్పల్ల హిల్స్ సచివాలయాలకు చెందిన సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు.