ATP: అనంతపురంలోని జేఎన్టీయూ, ఎస్కేయూ విశ్వవిద్యాలయాలను ఎస్టీ కమిషన్ సభ్యుడు వెంకటప్ప నేడు సందర్శించనున్నారు. తొలుత జేఎన్టీయూలో విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందితో సమావేశమై ప్రభుత్వం అమలు చేస్తున్న ఎస్టీ సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం ఎస్కేయూ అధికారులతో భేటీ అయి అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు.