హైదరాబాద్ శివారు మొకిల పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ డ్రగ్స్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. రైల్వే ఉద్యోగి సిద్ధార్థ, ఐటీ ఉద్యోగి హేమంత్, వ్యాపారి విష్ణు తేజలను అరెస్ట్ చేసి, వారి నుంచి 77 గ్రాముల కొకైన్, ఓజీ గంజాయి, ఎక్స్టసీ గుళికలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు విలాసవంతమైన కారు, ఐఫోన్లను వాడుతూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.