WG: జిల్లాలో నిర్మాణం పూర్తయిన గృహాలను నేడు లబ్ధిదారులకు పండుగ వాతావరణంలో అందజేయనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొనే ఈ వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆమె అన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడంలో ప్రభుత్వం చేపట్టిన ఈ గృహ నిర్మాణ పథకం ఇప్పుడు కీలక దశకు చేరుకుందని కలెక్టర్ పేర్కొన్నారు.