VKB: కోడిగుడ్ల ధరలు గణనీయంగా పడిపోవడం పౌల్ట్రీ రంగంలో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రస్తుతం జిల్లాలో గుడ్డు ధర రూ.3.50-రూ.4.50 మధ్య, ఇక ట్రే గుడ్లు రూ.120-రూ.140 పడిపోవడం చిన్న వ్యాపారులను ఆందోళనకు గురిచేస్తోంది. కాగా, తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.