NZB: సిరికొండ మండలంలో వరి కోతలు జోరందుకున్నాయి. రావుట్ల, మైలారం, కొండూరు తదితర గ్రామాల్లో కోతలు మొదలై 15 రోజులవుతున్నా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. దీంతో రోడ్లపై, కల్లాల వద్ద ధాన్యం కుప్పలు పేరుకుపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల ముప్పు పొంచి ఉన్నందున, అధికారులు తక్షణమే స్పందించి కేంద్రాలను తెరిచి మద్దతు ధరకు ధాన్యం సేకరించాలన్నారు.