సత్యసాయి: పెనుకొండ అభివృద్ధిలో భాగంగా మెడికల్ కళాశాల సమీపంలో 27 ఎకరాల్లో అహుడా ఎన్టీఆర్ ఎంఐజీ లేఅవుట్‌కు మంత్రి సవితమ్మ, అహుడా చైర్మన్ టి.సి.వరుణ్ శంకుస్థాపన చేశారు. రూ.16.6 కోట్లతో అభివృద్ధి చేస్తున్న ఈ లేఅవుట్లో మధ్యతరగతి కుటుంబాల కోసం 292 ఫ్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక్కడ అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు.