NLR: బుచ్చి సీఐ శ్రీనివాసరావు ఆకతాయిల ఆట కట్టించారు. ఆదివారం రాత్రి నిబంధనలకు విరుద్ధంగా బైక్‌లకు సైలెన్సర్లు బిగించుకుని హల్చల్ చేస్తున్న వారిపై చర్యలకు ఉపక్రమించారు. సైలెన్సర్‌ను నిర్వీర్యం చేయించి యువకుడి తలపై పెట్టి మరోసారి ఇటువంటి తప్పు చేయనని ప్రమాణం చేయించారు. ఎవరైనా సైలెన్సర్లు వినియోగిస్తే, ఇదేవిధంగా పట్టణంలో ఊరేగిస్తామని సీఐ హెచ్చరించారు.