ముంబై ఇండియన్స్ IPL-2026 చరిత్రలో శుభారంభం చేసింది. 13 ఏళ్ల నిరీక్షణ తర్వాత తొలిసారి సీజన్ ఓపెనింగ్ మ్యాచ్‌లో కోల్‌కతాపై ఘనవిజయం సాధించి రికార్డు సృష్టించింది. 221 పరుగుల భారీ లక్ష్యాన్ని రోహిత్ (78), రికెల్టన్ (81) మెరుపు ఇన్నింగ్స్‌లతో ఛేదించారు. ఈ మ్యాచ్‌తోనే ముంబై తన ‘తొలి మ్యాచ్ ఓటమి’ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి పాయింట్ల పట్టికలో బోణీ కొట్టింది.