కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై 19.1 ఓవర్లలో ఛేదించింది. MI ఓపెనర్లు రికల్టన్(81), రోహిత్(78) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. చివర్లో తిలక్(20), పాండ్యా(18*) కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఈ విజయంతో ముంబై ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి.