కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై తరఫున రోహిత్ శర్మ అద్భుత హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 23 బంతుల్లోనే రోహిత్ అర్ధశతకం (51*)తో అదరగొట్టాడు. మరోవైపు రికెల్టన్ (28*) అతనికి మంచి పార్టనర్షిప్ అందిస్తున్నాడు. దీంతో 6 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు వికెట్ నష్టపోకుండా 80 పరుగులుగా నమోదైంది.