AKP: బీహార్ రాష్ట్రం రాజగిరిలో ఏప్రిల్ 1 నుంచి జరిగే సబ్ జూనియర్ నేషనల్ హాకీ పోటీలకు జిల్లా నుంచి ముగ్గురు ఎంపికైనట్లు జిల్లా హాకీ అసోసియేషన్ కన్వీనర్ కే నరేష్ తెలిపారు. ఎలమంచిలికి చెందిన కె సూర్య ప్రదీప్, ఎల్ చైతన్య, నక్కపల్లికి చెందిన దేవేందర్ వెంకట్ ఎంపికైన వారిలో ఉన్నారని పేర్కొన్నారు. పోటీల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.