ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ భారత మీడియాపై అసహనం వ్యక్తం చేశాడు. కొన్ని మీడియా ప్లాట్‌ఫారమ్‌లు తన ఫిట్నెస్ గురించి కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డాడు. గాయం కారణంగా KKRకు దూరం కావడం తనను బాధిస్తోందన్నాడు. ఈ సందర్భంగా ఆ జట్టు అభిమానులకు క్షమాపణలు తెలిపాడు. వీలైనంత త్వరగా కోలుకుని IPL బరిలోకి దిగేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు.