సత్యసాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్ కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆదివారం తిరువనంతపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించిన ఆయన, పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేరళలో బీజేపీ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.