రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్ 2’ మూవీ రూపొందుతోంది. గతంలో వచ్చిన ‘జైలర్’ సీక్వెల్గా వస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 4న జన్మాష్టమి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన మరో రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది.