ADB: వృద్ధ తల్లిదండ్రులను చూసుకోని ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో పదిహేను శాతం కోత బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం పొందటం పట్ల బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లు తీసుకువచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా మిగతా వాళ్లు కూడా భయపడేలా చట్టం ఉండాలని కోరారు.