GNTR: టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. పార్టీ జెండాను ఎగురవేసి, వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ.. తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక టీడీపీ అని అన్నారు.