NZB: డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన ఆరుగురికి ఒక్కొక్కరికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధించారు. నిజామాబాద్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హైమద్ మొయినుద్దీన్ తీర్పు వెల్లడించారని ట్రాఫిక్ CI ప్రసాద్ ఆదివారం తెలిపారు. అలాగే 35 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ. 3.50 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.