GDWL: 1980లో జనసంఘ్ నుంచి బీజేపీగా రూపాంతరం చెందిన నాటి నుంచి మా లక్ష్యం కేవలం అధికారం కాదు అని బీజేపీ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అనారు. ఆదివారం ఇటిక్యాల మండలం కోదండపూర్లో మండల అధ్యక్షుడు అబ్దుల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల ప్రశిక్షణా తరగతుల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.