ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ను ఓ విచిత్రమైన రికార్డు గత 13 ఏళ్లుగా వెంటాడుతోంది. 2013 సీజన్ నుండి 2025 వరకు ఒక్కసారి కూడా ముంబై జట్టు తమ ఆరంభ మ్యాచ్‌లో విజయం సాధించలేదు. ఈ ఏడాది IPL-2026లో భాగంగా ఈరోజు తమ హోమ్ గ్రౌండ్ వాంఖేడేలో KKRతో తలపడనుంది. మరి ఈ రోజైనా ముంబై ఈ ‘చెత్త రికార్డు’ను తుడిచేసి విజయంతో బోణీ కొడుతుందో లేదో వేచి చూడాలి.