ఇటీవలే ‘ఫంకీ’ సినిమాతో దర్శకుడు అనుదీప్ KV అనుకున్న స్థాయిలో విజయం అందుకోలేకపోయాడు. తాజాగా ఆయన మరో ప్రాజెక్టు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీని తెరకెక్కించనున్నట్లు సమాచారం. అనుదీప్ కామెడీ మార్క్‌కి భిన్నంగా ఈ మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.