MHBD: 40ఏళ్ళు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన MLA కడియం శ్రీహరిపై అనుచితంగా ప్రవర్తించిన సభ్యులను వెంటనే బయటకు పంపించాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ MLA డా. రామచంద్రనాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై మండిపడ్డారు. పదేళ్లలో చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి, అవినీతి అంశంను పక్కదారి పట్టించడానికి BRS రాద్ధాంతం చేస్తున్నదన్నారు.