KMR: మద్నూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నారాయణ గోశాలలో ఆదివారం గోపేడ ఎరువు వేలం పాట నిర్వహించారు. బండివార్ శ్యామ్ రూ. 35,100 లకు, వెంకట్ బండివార్ రూ. 27,500 లకు వేలం పాటలో అధిక ధరకు ఎరువు దక్కించుకున్నట్టు గోశాల అధ్యక్షుడు సంజయ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు చాట్ల హన్మండ్ స్వామి, బొగ్గుల్ సంజయ్, సక్కర్ల నరేశ్, పాల్గొన్నారు.