MHBD: తొర్రూరు మండలంలోని పలు గ్రామాల్లో బెల్ట్ షాపుల దందా మూడు బాటిళ్లు, ఆరు కాసులుగా తయారైంది. ఊరురా బెల్ట్ షాపులు పదికి పైగా ఉండడంతో సామాన్యులు పొద్దంతా పనిచేసి సంపాదించిన సొమ్మును మద్యానికే ఖర్చు చేసి కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. దీనిని అరికట్టాల్సిన సంబంధిత అధికారులు మామూళ్లు తీసుకొని చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.