నందమూరి బాలకృష్ణ 111వ చిత్రంలో కాస్టింగ్ పరంగా భారీ మార్పులు జరుగుతున్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్గా నయనతార నటిస్తుండగా, తాజాగా రాయ్ లక్ష్మీ కీలక పాత్రకు ఎంపికైనట్లు సమాచారం. సెకండ్ హాఫ్‌లో వచ్చే ఈ పవర్ఫుల్ రోల్ కథను మలుపు తిప్పుతుందట. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.