TG: అసెంబ్లీలో MLA కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేశారు. సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నారనే కారణంతో కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు బీఆర్ఎస్ సభ్యులను ఇవాళ, రేపు సభ నుంచి సస్పెండ్ చేశారు.