మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబోలో ‘మెగా 158’ గ్రాండ్గా పట్టాలెక్కనుంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఏప్రిల్ 20 నుంచి షూటింగ్ ప్రారంభం కానుండగా, బాబీ ఈసారి పక్కా యాక్షన్ కథను సిద్ధం చేశాడట. అంతేకాదు ఈ కొత్త సినిమా కోసం కథానాయికలు, మిగిత నటీనటుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నారు.