ట్రిపుల్ ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'గేమ్ చేంజర్'. సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలను ప్రస్తావిస్తూ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న పవర్ ఫుల్ పొలిటికల్ యాక్షన్ డ్రామా గేమ్ చేంజర్. అయితే.. ఇండియన్ 2 వల్ల ఈ సినిమా షూటింగ్ డిలే అవుతూ వస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఇండియన్ 2కి సంబందించిన షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి అయినట్లు తెలుస్తుంది. మరో రెండు పాటలు చిత్రీకరణ మాత్రమే బ్యాలన్స్ ఉన్నట్లు సమాచారం. దీంతో.. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫస్ట్ హాప్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. కానీ గేమ్ చేంజర్ షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు.
రీసెంట్గా దిల్ రాజు సమ్మర్లో ఈ సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చాడు. కానీ షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందనే విషయంలో ఎవరికి క్లారిటీ లేదు. ఆ మధ్య కొంత గ్యాప్ తర్వాత మైసూర్లో గేమ్ చేంజర్ షూటింగ్ మొదలు పెట్టాడు శంకర్. మరోవైపు ఇండియన్ 2 షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టుగా టాక్. కాబట్టి.. నెక్స్ట్ గేమ్ చేంజర్ షూటింగ్ పై ఫోకస్ చేయనున్నాడు శంకర్. ఈ నేపథ్యంలో.. గేమ్ చేంజర్ లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్లో స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. గురువారం నుంచి ఈ కొత్త షెడ్యూల్ మొదలైంది. సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్న శ్రీకాంత్, సముద్రఖని, ఎస్జె సూర్య.. వారిపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం.
రామ్ చరణ్ త్వరలోనే ఈ షెడ్యూల్లో జాయిన్ కానున్నారట. ఇకపోతే.. గేమ్ చేంజర్ సినిమాతో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా.. దిల్ రాజ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి గేమ్ చేంజర్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో చూడాలి.