KDP: ఒంటిమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన శనివారం రాత్రి స్వామివారు రాజహంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధుల్లో జరిగిన ఈ ఊరేగింపు కోలాటాలు, చెక్కభజనలు, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత కోలాహలంగా సాగింది. భక్తులు అడుగడుగునా స్వామివారికి నీరాజనాలు పలికి, కాయాకర్పూరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.