MDCL: కుషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 42 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో సుమారు 2,284 మంది బాలికలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వీరి వయస్సు 14 నుంచి 15 సంవత్సరాల మధ్యగా ఉంది. ఈ బాలికలకు గర్భాశయ కేన్సర్‌ను నివారించే హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందించేందుకు వైద్య శాఖ చర్యలు ప్రారంభించింది. త్వరలోనే వీరికి అందించనున్నారు.