AP: శ్రీకాకుళం జిల్లా నుంచి కేంద్ర, రాష్ట్ర మంత్రి పదవుల్లో ఉన్న రామ్మోహన్, అచ్చెన్న.. ఈ జిల్లాకు ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారో చెప్పాలని మాజీమంత్రి సీదిరి అప్పలరాజు నిలదీశారు. దశాబ్దాలుగా TDP పదవులు అనుభవించిన కుటుంబం జిల్లాకు చేసిన మేలు ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు వల్లే మూలపేట పోర్టు వచ్చిందని రామ్మోహన్ చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.