TG: BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై యశస్వినీ రెడ్డి ఫైర్ అయ్యారు. ‘తండ్రి లాంటి కడియం శ్రీవారికి మర్యాద ఇవ్వకుండా మాట్లాడతారా? నిన్నటి నుంచి చూస్తున్నా.. డిమాండ్లపై చర్చ జరుగుతుంటే సభా సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు? కొత్త MLAలకు మీరిచ్చే సందేశం ఇదేనా? పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి సభను స్పీకర్ ఆర్డర్లో పెట్టాలి’ అని పేర్కొన్నారు.