AP: గత పాలకులు 79 మంది TDP కార్యకర్తలను హత్య చేయించారని లోకేష్ ఆరోపించారు. తోట చంద్రయ్యను చంపేస్తే.. చంద్రబాబు ఆయన పాడెను మోసి, వారి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారన్నారు. కొన్ని పార్టీలు రాజకీయ స్వార్థం కోసం కార్యకర్తలకు కత్తి అందిస్తే.. చంద్రబాబు తన కార్యకర్తల పిల్లలతో పుస్తకాలు పట్టించారని తెలిపారు. ఫ్యాక్షనిస్టుల పిల్లలనూ ప్రయోజకులను చేశారన్నారు.