VZM: పాచిపెంట మండల TDP అధ్యక్షుడు గూడాపు యుగంధర్ ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలో TDP ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసారు. అనంతరం స్దానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పంఢ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో AMC ఛైర్మన్ సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.