నెల్లూరు: విడవలూరు మండలంలోని అన్నా రెడ్డిపాలెం శ్రీ కోదండ రామస్వామి శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆదివారం వేకువ జామున గజ వాహనంపై శ్రీ కోదండరామ స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.