KMM: రాజీ మార్గమే రాజా మార్గమని, రాజీ పడదగ్గ కేసులలో రాజీ పడి సత్వర న్యాయం పొందాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ జి. రాజగోపాల్ అన్నారు. శనివారం జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్‌లో జాతీయ లోక్ అదాలత్‌ను జిల్లా ప్రిన్సిపల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ నిర్వహించారు.