JGL: ఉద్యోగంలో చేరిన ప్రతి వ్యక్తికి ఉద్యోగ విరమణ సహజమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్ మండలంలోని ఒడ్డె లింగాపూర్ ఆస్పత్రి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్. సాగర్ రావు ఉద్యోగ విరమణ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరై వారికి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు.