MDK: రోడ్లపై పెండింగ్ పనులు పూర్తి చేసి రోడ్డు ప్రమాదాలు జరగకుండ చూడాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. మెదక్ కలెక్టరేట్లో రోడ్ సేఫ్టీ, మత్తు పదార్థాల నిర్మూలనపై సమావేశం నిర్వహించారు. ప్రతి పౌరుడు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ రోడ్డుపై ప్రయాణించే ప్రతి ఒక్క వాహనదారుడు సకాలంలో క్షేమంగా ఇంటికి చేరాలన్నారు.