GDWL: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ నీలి శ్రీనివాసులు తెలిపారు. శనివారం ఎర్రవల్లి మండలం కోదండపురంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. పేదలకు గృహ స్వప్నం నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.