E.G: సీఎం చంద్రబాబు రాజకీయాల కోసం అమరావతిని పావుగా వాడుకుంటున్నారని మాజీ ఎంపీ భరత్ శనివారం రాజమండ్రిలో విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు చిత్తశుద్ధి ఉంటే అమరావతిలో నివసించాలని డిమాండ్ చేశారు. అమరావతిలో రాజధాని నిర్మాణానికి వైసీపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. మళ్ళీ వైసీపీ వస్తే రాజధాని మార్చేస్తారని మొసలి కన్నీళ్లు కారుస్తున్నారన్నారు.