JGL: మేడిపల్లి మండలం వల్లంపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, మౌలిక వసతులపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.