VKB: ధారూర మండల పరిధిలోని నాగసమందర్లో మరింత కట్టుదిట్టం చేస్తూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను గురువారం ధారూర్ ఎస్సై సున్నం రాఘవేందర్ ప్రారంభించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సర్పంచ్ వెంకట్ ఆధ్వర్యంలో ఈ నిఘా నేత్రాలను ఏర్పాటు చేయడం విశేషం. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ఎంతో దోహదపడతాయని తెలిపారు.