GDWL: వడ్డేపల్లి మున్సిపాలిటీ శాంతినగర్లో ప్రయాణికుల కోసం చలువ పందిర్లు ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఛైర్మన్ మంజుల ధర్మ, 7వ వార్డు కౌన్సిలర్ విజయభాస్కర్ ఆధ్వర్యంలో శనివారం శాంతినగర్-ఐజ బస్ స్టాప్ వద్ద ఈ ఏర్పాట్లు చేశారు. ఎండాకాలంలో ప్రయాణికులకు ఉపశమనం కలిగించేందుకు తాత్కాలిక పందిరి వేశామని తెలిపారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.