కూల్ డ్రింక్స్, సోడాలు దాహం తీర్చవు. అంతేకాదు అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. వీటిని ఎక్కువగా తాగితే అధిక చక్కెర వల్ల బరువు పెరగడం, మధుమేహం, ఎముకలు, కిడ్నీ సమస్యలు వస్తాయి. ఇవి కేవలం ఖాళీ క్యాలరీలను ఇస్తాయి. వీటికి బదులుగా కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ, సబ్జా నీళ్లు లేదా పండ్ల రసాలు తాగాలి. ఇవి ఆరోగ్యంతో పాటు శరీరానికి మంచి రిఫ్రెష్మెంట్ను అందిస్తాయి.