WGL: HYDలోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న ధర్నాకు బయలుదేరిన వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశా వర్కర్లను సంగెం పోలీసులు అరెస్టు చేశారు. వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ.. “ధర్నా చేయడానికి వెళ్తున్న మమ్మల్ని అరెస్టు చేయడం సరికాదు” అని అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.