WNP: ఉమ్మడి అమరచింత, ఆత్మకూరు మండలాలకు సంబంధించి కుసుమ్ ప్రాజెక్టు కింద మంజూరైన సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ప్రశాంతి శనివారం ఆత్మకూరులో భూమిపూజ చేశారు. రూ.3 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 2.70 కోట్ల బ్యాంకు రుణం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పుల్లరి భరత్ ఏపీఎం పారిజాత సీసీలు పాల్గొన్నారు.