MDCL: తెలంగాణ రాష్ట్ర చికెన్ సెంటర్ ఓనర్స్ అసోసియేషన్ ఉప్పల్ డివిజన్ వ్యాపారులు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని సైనిక్‌పురిలో కలిసి వినతిపత్రం అందజేశారు. పెద్ద పౌల్ట్రీ వ్యాపారులు ధరలను నియంత్రించడం వల్ల చిన్న వ్యాపారులు నష్టపోతున్నారని అవేధించారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తానని ఎమ్మెల్యే మాటిచ్చారు.