»Mlc Jeevan Reddy Counter To Ktr Over New Govt In Telangana
Jeevan Reddy: రాష్ట్రాన్ని నిండా అప్పుల్లో ముంచారు : జీవన్ రెడ్డి
ప్రభుత్వం ఎలా నడపాలో మాకు తెలుసునని కేటీఆర్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్త ఏర్పాడిన ప్రభుత్వాన్ని దీవించడం పోయి.. ప్రభుత్వం ఎలా నడుస్తుందో చూస్తామని కేటీఆర్ పేర్కొనడం సరికాదన్నారు.
Jeevan Reddy: ప్రభుత్వం ఎలా నడపాలో మాకు తెలుసునని కేటీఆర్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్త ఏర్పాడిన ప్రభుత్వాన్ని దీవించడం పోయి.. ప్రభుత్వం ఎలా నడుస్తుందో చూస్తామని కేటీఆర్ పేర్కొనడం సరికాదన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన ఘనత మీదేనని, రాష్ట్రాన్ని నిండా అప్పుల్లో ముంచారన్నారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం మద్యానికి బానిసగా చేసిందంటూ జీవన్ రెడ్డి మండిపడ్డారు. నేడు జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలో ఫిల్టర్ బెడ్ ను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరిశీలించారు. జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ‘కేటీఆర్‌కి ఉన్న అవగాహన ఏమిటో ఓసారి తెలుసుకోవాలి.
ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలని నెమరువేసుకో కేటీఆర్. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని దీవించడం పోయి.. ప్రభుత్వం ఎలా నడుస్తుందో చూస్తానని అనడం సరికాదు. కేటీఆర్.. ప్రభుత్వం మంచి కోరుకో, రాష్ట్ర ప్రభుత్వనికి సహకరించు. నువ్ ఏం భయపడాల్సిన అవసరం. మాకు గతంలో ప్రభుత్వాన్ని నడిపిన అనుభవం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన ఘనత మీదే. రాష్ట్రన్ని నిండా అప్పుల్లో ముంచారు. ఆదాయం సమాకుర్చుకోవడనికి తెలంగాణ సమాజాన్ని మద్యానికి బానిసను చేశారు. బెల్ట్ షాప్ లను ఎత్తేస్తాం. తెలంగాణ రాష్ట్రాన్ని మద్యం నుంచి విముక్తి కలిపిస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తాం. ప్రజలకు మంచి పాలన అందిస్తాం’ అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.