ప్రకాశం: కంభం పట్టణంలోని పాలిటెక్నిక్ కాలేజ్ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న ఆటో ఆగి ఒక్క సారిగా రివర్స్ చెయ్యడంతో వెనుక నుండి కార్ ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో ఆటోలో నలుగురు, కారులో నలుగురు ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎటువంటి గాయాలు అవ్వలేదు. ఆటో, కారు స్వల్పంగా దెబ్బతిన్నాయి.